Gossipsఇలా చేస్తే కొత్తగా వుంది - నారా రోహిత్

ఇలా చేస్తే కొత్తగా వుంది – నారా రోహిత్

నారా వారి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో నారా రోహిత్ తన తొలి సినిమా నుండి కొత్త కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్న రోహిత్ ఈసారి పక్కా కమర్షియల్ అంశాలతో బాలకృష్ణుడు సినిమాతో వస్తున్నాడు. ఈ తరహా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ మన ఆడియెన్స్ కు చాలా కామన్.. కాని నాకు కొత్త అంటున్నాడు నారా రోహిత్.

సినిమా ఆడియెన్స్ కు కొత్తగా అనిపించదు.. కాని ఇలాంటి సినిమాలు నాకు కొత్త అందుకే బాలకృష్ణుడు సినిమా చేశా అంటున్నాడు నారా రోహిత్. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ కోసం జిం వర్క్ అవుట్స్ చేసిన నారా రోహిత్ దాదాపు 21 కిలోల పాటు తగ్గాడని తెలుస్తుంది. సినిమా కోసం ఈమాత్రం కష్టపడక తప్పదు అంటున్నాడు.

ఈమధ్య తన లుక్ విషయంలో వచ్చిన కామెంట్స్ లు రాగా ఇక నుండి స్లిమ్ గా ఉండేందుకే ప్రయత్నిస్తా అంటున్నాడు రోహిత్. కొత్త ప్రయోగాలు చేసినా కమర్షియల్ సక్సెస్ అందుకోని నారా హీరో పక్కా కమర్షియల్ బాటలో వస్తున్న ఈ రొటీన్ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news