Gossipsబాలయ్య నెక్స్ట్ మూవీ పై కొత్త ట్విస్ట్

బాలయ్య నెక్స్ట్ మూవీ పై కొత్త ట్విస్ట్

బాలయ్య ఏమాత్రం తగ్గడం లేదు సరికదా యంగ్ హీరోలకు గట్టి పోటీ కూడా ఇచ్చేస్తూ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లో నటించిన తర్వాత పూరిజగన్నాధ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమాలో నటించారు. ఆ తరువాత జై సింహా సినిమాతో సంక్రాంతిబరిలో ఉన్న బాలయ్య ఆ సినిమా తరువాత మరికొన్ని సినిమాలు ఒప్పుకున్నాడు.
బాలయ్యతో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సరికొత్త సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ సినిమా చేస్తున్నా … అనిల్ బాలయ్య కాంబినేషన్ లేనట్టే అని తెలుస్తోంది.
ప్రస్తుతం `జైసింహ` సినిమా చేస్తున్న బాలయ్య ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డితో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా ఉండబోతుంది. మరి యంగ్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా ఉందా లేదా అనేది ఇప్పటికీ ఎవరి దగ్గరా సమాచారం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news