Moviesబిగ్గెస్ట్ బ్లాస్టర్ గా బాహుబలి 2

బిగ్గెస్ట్ బ్లాస్టర్ గా బాహుబలి 2

ఇండియాస్ బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ బాహుబ‌లి 2 చిత్రం ఏప్రిల్ 28, 2017న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ని తిర‌గ‌రాసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 1050 స్క్రీన్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకొని ఆల్ టైం ఇండియ‌న్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ మూవీ కూడా 50 రోజుల త‌ర్వాత వెయ్యి సెంట‌ర్లలో ఆడింది లేదు. మ‌రి వంద రోజులు ఎన్ని సెంట‌ర్స్ లో పూర్తి చేసుకుంద‌నే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి 2 చిత్రం త్వ‌ర‌లో చైనాలో కూడా విడుద‌ల కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 1600 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు సాధించింది. ప్ర‌భాస్, రానా , అనుష్క‌, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్కా మీడియా వ‌ర్క్స్ బేన‌ర్ పై ఈ మూవీ నిర్మిత‌మైంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news