Movies" భాగమతి "రివ్యూ & రేటింగ్

” భాగమతి “రివ్యూ & రేటింగ్

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ వన్నె తెచ్చిన స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా భాగమతి. పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా అంచనాలను అందుకుంది లేనిది ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :
ఓ సిన్సియర్ ఐ.ఏ.ఎస్ అయిన చంచల (అనుష్క) మంచి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటుంది. ఓ చిన్న గ్రామంలో పనులకు వెళ్లిన చంచల అక్కడ శక్తి (ఉన్ని ముకుందన్) ను చూసి ఇష్టపడుతుంది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితం సడెన్ గా జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇంతలోనే ఓ బంగ్లాకు సంబందించిన గొడవ జరుగుతుంది. ఐ.ఏ.ఎస్ అయిన చంచల అనివార్యకారణాల వల్ల జైలుకి వెళ్తుంది. జైలు నుండి వచ్చిన ఆమె ఆ బంగ్లాకు వంటరిగా వెళ్తుంది. అసలు చంచల జైలుకి ఎందుకు వెళ్లింది..? బంగ్లాలో అడుగుపెట్టిన ఆమెకు ఎదురైన అనుభవాలేంటి..? భాగమతి ఎవరి మీద పగ పట్టింది అనేది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :
అనుష్క మాత్రమే చేయగలిగే పాత్రగా భాగమతి చెప్పుకోవచ్చు. చంచల, భాగమతి రెండు పాత్రల్లో వేరియేషన్స్ చూపించిన తీరు అద్భుతం. అరుంధతి తర్వాత పూర్తిస్థాయిలో అనుష్క ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. మరోసారి స్వీటీ తన నట విశ్వరూపం చూపించింది. ఇక ఉన్ని ముకుందన్ రోల్ కూడా ఇంప్రెస్ చేసింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

డైరక్టర్ అశోక్ పడిన కష్టం తెర మీద కనబడుతుంది. రాసుకున్న కథ కథనాల మీద దర్శకుడు అన్నివిధాలుగా సక్సెస్ అయ్యాడు. థ్రిల్లర్ కథాంశంగా మలచిన భాగమతి డైరక్టర్ టాలెంట్ ను ప్రెజెంట్ చేస్తుంది. ఇక మధి కెమెరా వర్క్ సూపర్ సినిమాకు చాలా సపోర్ట్ ఇచ్చింది కెమెరా వర్క్. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా సినిమాకు ప్రాణం పోసాయి. తమన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :
అరుంధతి సినిమా తీసిన తర్వాత అనుష్క నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే అందరు ఆ సినిమాతో పోల్చుకోవడం కామన్. ఇది ఫక్తు అరుంధతి సినిమాలా పాడుబడ్డ బంగ్లా కథాంశంతో వచ్చింది కాబట్టి ఆడియెన్స్ మరింత ఆ సినిమాతో పోల్చి చూస్తారు. అయితే అంచనాలను ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు డైరక్టర్ అశోక్.
కథ, కథనాల్లో తన టాలెంట్ చూపించేశాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేత్ ఓ పాటుగా సస్పెన్స్ థ్రిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి భాగం క్యారక్టర్ ఎస్టాబ్లిష్ తో పాటుగా సస్పెన్స్ క్రియేట్ చేసిన డైరక్టర్ సెకండ్ హాఫ్ సినిమాను ఎంగేజ్ అయ్యేలా చేశాడు. సినిమా మొత్తంలో భాగమతి చేసిన ఆ పోర్షన్ మాత్రం బాగా వచ్చింది.

సస్పెన్స్ థ్రిల్లర్లు చెల్లుబాటు అవుతున్న ఈ టైంలో భాగమతి లాంటి సినిమా మళ్లీ అలాంటి సినిమాలకు కొత్త ఉత్సాహన్ని ఇస్తాయని చెప్పొచ్చు. సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా యూత్ ఆడియెన్స్.. థ్రిల్ సినిమాలను చూసే ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

అనుష్క
ఫస్ట్ హాఫ్
ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్ :
కథ పాతదే
మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ : అనుష్క భాగమతి.. అలరించింది..!

రేటింగ్ : 2.75/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news