Gossipsస్టార్ హీరోలకు వణుకు పుట్టిస్తున భాగమతి కలెక్షన్స్

స్టార్ హీరోలకు వణుకు పుట్టిస్తున భాగమతి కలెక్షన్స్

స్వీటీ అనుష్క మరోసారి బాక్సాఫీస్ మీద తన వీర ప్రతాపం చూపిస్తుంది. పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో అనుష్క లీడ్ రోల్ లో వచ్చిన సినిమా భాగమతి. సస్పెన్స్, హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆడియెన్స్ ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన అనుష్క నటన వసూళ్ల వరద కురిపిస్తుంది. మొదటి వీకెండ్ లోనే 25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించిన భాగమతి ఇప్పుడు ఏకంగా 40 కోట్ల మార్క్ దాటేసిందని తెలుస్తుంది.

యువి క్రియేషన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ భాగమతి సినిమాలో అనుష్క నటనకు అందరు ఫిదా అవుతున్నారు. తమన్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్ గా సినిమా అంచనాలను అందుకోవడమే కాదు అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది. సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతుంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అనుష్క చేతున్న భాగమతి హంగామా అంతా ఇంతా కాదు. సినిమా హిట్ కు పూర్తి భాధ్యత అనుష్కది అయితే డైరక్టర్ అశోక్ కు కూడా ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పొచ్చు.

http://www.telugulives.com/telugu/balayya-health-details/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news