Moviesస్టార్ హీరోలందరికీ షాక్ ఇచ్చిన బాహుబలి... వెయ్యి దాటిన 50 రోజుల...

స్టార్ హీరోలందరికీ షాక్ ఇచ్చిన బాహుబలి… వెయ్యి దాటిన 50 రోజుల సెంటర్లు

ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో యాభై రోజుల సినిమాలు ఎక్కడా కనపడ్డం లేదు .. ఎంతటి పెద్ద హీరో అయినా ఎంత తోపు సినిమా అయినా యభై రోజుల రన్ అంటే అసలు అది వేరే వ్యవహారం, ‘బాహుబలి-2’ ఈ విషయంలో కూడా సత్తా చాటింది.విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీతో నిరంతరం వార్తల్లో నిలిచిన ఈ చిత్రం… వేరే సినిమాలతో నాకు పోలికే లేదంటూ హాఫ్ సెంచరీ (50 రోజులు) కొట్టేసింది. అది కూడా మామూలుగా కాదు… దేశ వ్యాప్తంగా ఏకంగా 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది.మరోవైపు 50 రోజులు గడిచిపోయినా, ఈ సినిమాకు ఇంకా ఆదరణ తగ్గలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 1650 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. త్వరలోనే ఈ సినిమాను చైనాలో విడుదల చేయనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news