Gossipsపవన్ - త్రివిక్రమ్ చిత్రం మీద బాహుబలి ఎఫెక్ట్

పవన్ – త్రివిక్రమ్ చిత్రం మీద బాహుబలి ఎఫెక్ట్

నిన్న మొన్నటి వరకు భారీ సెట్స్‌ వేయడమంటేనే మన వాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు కాదు. సెట్స్‌ వేసే దర్శకులు గుణశేఖర్‌లాంటి వాళ్లపై జోకులు కూడా వేసేవారు. కానీ సెట్స్‌ వేసి భారీ బ్లాక్‌బస్టర్‌ కొట్టిన బాహుబలి ఇన్‌స్పిరేషన్‌తో ఇప్పుడు చాలా సినిమాలకి సెట్స్‌ నిర్మిస్తున్నారు.

పవన్‌, త్రివిక్రమ్‌ సినిమా కోసం ఏకంగా దుబాయ్‌ సెట్‌ వేస్తున్నారట. ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ ప్యాలెస్‌ సెట్‌ నిర్మించారు. మహేష్‌తో కొరటాల తీసే సినిమా కోసం అసెంబ్లీ, సెక్రటేరియేట్‌ పునఃసృష్టిస్తున్నారు. కోట్ల వ్యయంతో వేస్తోన్న ఈ సెట్స్‌ ఏవీ మునుపటిలా పూర్తి స్థాయి సెట్స్‌ కాకపోవడం విశేషం.

బాహుబలి నుంచి స్ఫూర్తి పొంది కేవలం హైలైట్స్‌ మాత్రమే ఆర్ట్‌ డైరెక్టర్‌తో రూపొందిస్తున్నారు. మిగతాది గ్రీన్‌ మ్యాట్‌లో తీసి గ్రాఫిక్స్‌ సాయంతో పూర్తి డెకరేషన్‌ చేస్తారు. గతంలో పది కోట్ల వ్యయం అయ్యే సెట్‌ ఇప్పుడు కోటిన్నరలోనే అయిపోతోందట

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news