Gossipsబాహుబలి-2 అక్కడ అట్టర్ ఫ్లాప్..!

బాహుబలి-2 అక్కడ అట్టర్ ఫ్లాప్..!

దర్శకధీరుడు ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి ఎన్ని సంచలనాలు.. మరెన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినా ప్రూవ్ చేసింది బాహుబలి. మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ బీభత్సమైన కలక్షన్స్ రాబట్టింది. అయితే ఇండియాలో ఇంత పెద్ద హిట్ సినిమా చరిత్రలో నిలిచిన బాహుబలి జపాన్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది.

బాహుబలి-2 జపాన్ లో రిలీజ్ చేశారు నిర్మాతలు. రిలీజ్ అయ్యి 5 వారాలు అవుతున్నా సరే కేవలం అక్కడ హాఫ్ మిలియన్ కలక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈ లెక్కన చూస్తే అక్కడ ఈ సినిమా డిజాస్టర్ అని చెబుతున్నారు. రజినికాంత్ ముత్తు సినిమా జపాన్ లో మిలియన్ మార్క్ దాటింది. ఇలా చూస్తే బాహుబలి-2కి అక్కడ పెద్ద షాకే తగిలిందని చెప్పొచ్చు.

చైనాలో బాహుబలి మొదటి పార్ట్ వన్ గ్రాండ్ గా రిలీజ్ చేసినా అంతగా ఆదరణ దక్కించుకోలేదు. అందుకే బాహుబలి కన్ క్లూజన్ ను అక్కడ రిలీజ్ చేయలేదు. ఏది ఏమైనా ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేపిన బాహుబలి జపాన్ లో మాత్రం నిరాశ పరచిందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news