స్టైలిష్ స్టార్ అయ్యాడు బిజినెస్ ” స్టార్ ” !

arjun into business

ఇప్పుడు ఇండ్రస్ట్రీని ఏలుతున్న కుర్ర హీరోలు మామూలోళ్లు కాదండోయ్ ! సినిమాలు ఒకపక్క .. వ్యాపారం ఒకపక్క ఇలా రెండు చేతులా సంపాదించేస్తున్నారు. ఒకవేళ సినిమా రంగంలో కొంచెం అటు ఇటు ఒడిదుడుకులు వచ్చినా తమ కెరియర్ కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వీళ్ళు ముందు నుంచే పక్కా ప్లాన్ తో వ్యవహారం చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు అల్లు వారి అబ్బాయి స్టైలిష్ స్టార్ కూడా చేరిపోయి రెండుచేతులా బాగానే సంపాదించేస్తున్నాడు.

అల్లుఅర్జున్ ఇప్పడు వ్యాపారాల్లో కూడ ఫుల్ స్పీడ్ చూపిస్తు తోటి యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో నిన్న నవంబర్ 17 సాయంత్రం 8 గంటలకు బీ-డబ్స్ అంటూ కొత్త బిజినెస్ వెంచర్ ను స్టార్ట్ చేసాడు బన్ని తెలుస్తున్న సమాచారం మేరకు ఇదో స్పోర్ట్స్ బార్. యూఎస్ ఏకు చెందిన బఫెలో వైల్డ్ వింగ్స్ ను ఇండియాలో బీ-డబ్స్ పేరుతో స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని ఈ స్పోర్ట్స్ బార్ మొదలు అయింది. దీనిలో అల్లు అర్జున్ కు పార్ట్నర్ షిప్ ఉందని ఇన్వెస్టర్ కూడా అంటూ ఏకంగా పోస్టర్స్ నే ప్రింట్ చేయడం బన్నీ అభిమానులను ఆకర్షించే మరో ఎత్తుగడ అని అంటున్నారు. అల్లు అర్జున్ కు వ్యాపారాలు కొత్తకాదు ఇప్పటికే 800 జూబిలీ అంటూ ఓ పబ్ ఉంది. కొన్ని రోజుల క్రితమే ఇదే ప్రెమిసెస్ లో కానోలీ కేఫ్ అంటూ ఓ స్విస్ బేకరీని కూడా స్టార్ట్ చేశాడు బన్నీ.
ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు కొత్తకొత్త వ్యాపారాలు చేస్తూ బన్ని తన కెరియర్ ను పరగులు తీయిస్తున్నాడు.

More from my site