Newsఅర్జున్ రెడ్డి కథ నాది.. కోర్టు నోటీసులు పంపిస్తా..!

అర్జున్ రెడ్డి కథ నాది.. కోర్టు నోటీసులు పంపిస్తా..!

ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా మీద మరో కొత్త వివాదం వచ్చి పడింది. సినిమా కథ తను తీసిన ‘ఇక సె..లవ్’ సినిమా చూసి రాశాడంటూ సినిమా మీద కేసు వేస్తానని అంటున్నాడు ఖమ్మం జిల్లా నుండి వచ్చిన నాగరాజు. ఈమధ్యనే రిలీజ్ అయిన ఇక సె..లవ్ అసలు వచ్చింది వెల్లింది కూడా ఎవరికి తెలియదు.

అయితే తన సినిమా కథనే ఇప్పుడు అర్జున్ రెడ్డిగా తీశాడంటూ సందీప్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నాడు నాగరాజు. అంతేకాదు చిత్ర దర్శక నిర్మాతలు తనకు 2 కోట్లు నష్టపరిహారం కట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఒకవేళ అర్జున్ రెడ్డి నిర్మాతలు తన వాదనని పట్టించుకోకుండా చట్టపరంగా తాను వెళ్తానని అంటున్నాడు.

ఇక అర్జున్ రెడ్డి సినిమా తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తెరకెక్కించానని అన్నాడు ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి. విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్నిచోట్ల అదిరిపోయే కలక్షన్స్ తో దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news