Gossips'ఆ' సూపర్ ఛాన్స్ కూడా మిస్ చేసుకున్న అనుష్క... ఎంత పని...

‘ఆ’ సూపర్ ఛాన్స్ కూడా మిస్ చేసుకున్న అనుష్క… ఎంత పని చేసుకుంది..!!

స్వీటీ అనుష్క సైజ్ జీరో కోసం బరువు పెరుగగా ఆ తర్వాత ఆ సైజ్ తగ్గించుకోడానికి మాత్రం నానా తంటాలు పడుతుంది. సైజ్ జీరో తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో సింగం-3, బాహుబలి-2 సినిమాల్లో అలరించిన అనుష్క రెండిటిలోనూ ఇదవరకు ఉన్నంత క్రేజ్ తెచ్చుకోలేదు. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న భాగమతి కూడా పూర్తి కావడంతో అనుష్క కెరియర్ అగమ్య గోచరంగా మారింది.

బాహుబలి క్రేజ్ తో మరోసారి ప్రభాస్ కు జోడిగా సాహోలో నటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాని సాహో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ఇందులో హీరోయిన్ కాస్త బబ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కాస్తో కూస్తో గ్లామర్ షో కూడ అవసరం పడుతుంది. మరి ఇలాంటి టైంలో అనుష్కతో రిస్క్ ఎందుకని లైట్ తీసుకున్నారట చిత్రయూనిట్. బాలీవుడ్ భామలను వెతికి ఫైనల్ గా అనుష్కను కన్ఫాం చేసినా ఎంత ప్రయతించినా సైజ్ తగ్గకపోవడంతో వచ్చిన గొప్ప అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట అనుష్క.

చేస్తున్న భాగమతి పూర్తి కాగానే ఇక అనుష్క మళ్లీ తన మునుపటి రూపం కోసం యోగా చేసేందుకు సిద్ధమైందట. దాని కోసం కొంత గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉందట. అనుష్కని మళ్లీ ఇదవరకులా చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి అది ఎప్పటికి సాధ్యపడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news