Gossipsప్రభాస్ తో అనుష్క కావాలనే తప్పించుకుందా..! కారణమిదే

ప్రభాస్ తో అనుష్క కావాలనే తప్పించుకుందా..! కారణమిదే

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించేది అనుష్క అని వార్తలు వచ్చాయి. బాహుబలితో ఎలాగు నేషనల్ వైజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట మరోసారి కలిసి నటించడం మంచి విషయమే అనుకున్నారు. కాని ఈ వార్తలన్ని మీడియా సృష్టే అని తెలుస్తుంది.

బాహుబలి తర్వాత భాగమతి సినిమా చేస్తున్న అనుష్క ఆ సినిమా తర్వాత ఓ తమిళ సినిమాకు కమిట్ అయ్యిందట. ఇక ఇంతలోనే ప్రభాస్ సాహో ఆఫర్ కూడా వచ్చిందట. ముందు కమిట్మెంట్ ఇచ్చిన కారణం చేత ప్రభాస్ సాహోకి అనుష్క సారీ చెప్పేసిందట. అయితే స్వీటీ అనుష్క సాహోని వదులుకోడానికి ప్రభాస్ కు తనకు మధ్య వస్తున్న రూమర్లే కారణం అని కొందరంటున్నారు.

పైకి కోలీవుడ్ ఆఫర్ వల్లే ప్రభాస్ ఆఫర్ కాదని చెబుతున్నా అనుష్క మాత్రం మనసులో తనకు ప్రభాస్ కు పెడుతున్న లింకులకి భయపడే ఈ సినిమాకు సైన్ చేయలేదని అంటున్నారు. మరి బాహుబలి-2 ప్రమోషన్స్ లో మాత్రం ప్రభాస్ సినిమా అంటే కథ కూడా వినకుండా సినిమా చేస్తా అని చెప్పింది అనుష్క మరి ఇంతలోనే ఏమైందో ఏమో కాని మొత్తానికి అనుష్క ప్రబాస్ సినిమా అంటే వద్దండి బాబోయ్ అనే పరిస్థితికి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news