Moviesఇది భాగమతి 'కలెక్షన్ల' అడ్డా..! స్టార్ హీరోలకి సైతం చుక్కలు చూపిస్తున్న...

ఇది భాగమతి ‘కలెక్షన్ల’ అడ్డా..! స్టార్ హీరోలకి సైతం చుక్కలు చూపిస్తున్న అనుష్క !!

భాగమతి అనుష్క రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో అశోక్ డైరక్షన్ లో వచ్చిన సినిమా భాగమతి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కొత్త అర్ధం చెబుతూ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటున్న అనుష్క భాగమతిగా సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది. జనవరి 26న రిలీజ్ అయిన భాగమతి సినిమా అదిరిపోయే హిట్ టాక్ తో కలక్షన్స్ కుమ్మేస్తుంది.

ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ 30 కోట్ల షేర్ వసూళ్ల తో సంచలనంగా మారిన భాగమతి సినిమా.. అమెరికాలో మిలియన్ డాలర్ల మార్క్ టచ్ చేసి సత్తా చాటింది. భాగమతి అమెరికాలో కాసుల వర్షం కురిపించింది.ఇంతకుముందు అనుష్క నటించిన రుద్రమదేవి 9.71 కోట్లతో బిజినెస్ క్లోజ్ చేయగా..ఇప్పుడు భాగమతి 1 మిలియన్ మార్క్ తో రికార్డ్ సృష్టించింది.సాధారణంగా స్టార్ హీరోలకి కూడా సాధ్యం కానీ మిలియన్ మార్కుని అనుష్క తన సినిమాలతో సునాయాసంగా దాటుతూ స్టార్ హీరోలకి సైతం చుక్కలు చూపిస్తుంది.

సైజ్ జీరోతో కాస్త ఫాం కోల్పోయినట్టు కనిపించిన అనుష్క ఈ హిట్ తో మరో ఐదేళ్లు ఈ క్రేజ్ కొనసాగించే అవకాశం ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన భాగమతి సినిమాకు తమన్ మ్యూజిక్ కూడా హిట్ లో ప్రాధాన్యతగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news