Newsఛీ ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపైనే..

ఛీ ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపైనే..

A man, named Ansari raped his own wife along with his two friends bablu singh and afzal. This incident happened in Jharkhand.

కామంతో కళ్ళుమూసుకుపోయిన వారికి బంధాలు, బంధుత్వాలు కనిపించవని అనడానికి ఈ తాజా సంఘటనే నిదర్శనం. ఇటీవలే పెళ్ళి చేసుకున్న తన భార్య మీదే ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. అంతేకాదు.. స్వయంగా తానే వీడియో తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు కూడా. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రం పల్మావు జిల్లాలోని రహయ్యా అనే మారుమూల గ్రామానికి చెందిన అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తికి ఇటీవలే ఓ యువతితో వివాహమైంది. ఈ నవదంపతులను చూసేందుకు అన్సారీ స్నేహితులైన బబ్లూ సింగ్, అఫ్జల్‌ మియాలు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన అతిథులకి ఆ పెళ్ళికూతురు అన్ని రకాల మర్యాదలు చేసింది. అయితే.. భోజనం చేసిన తర్వాత ఆ కామాంధులు ఆమెపై కన్నేశారు. ‘నీ భార్యతో పడకసుఖం పంచుకోవాలని ఉంది’ అని వాళ్లడిగిన కోర్కెను తీర్చేందుకు ఈ కిరాతక భర్త కూడా సమ్మతించాడు.

తొలుత అన్సారీ తన భార్యపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత స్నేహితులతో కూడా చేయించాడు. అంతేకాదు.. ఈ మొత్తం అఘాయిత్యాన్ని అన్సారీయే స్వయంగా వీడియో తీసి.. ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించాడు. తర్వాతిరోజు ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న ఆమె.. తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్థానిక పోలీసు అధికారి కేసు పెట్టకుండా వెనక్కి పంపించడంతో వాళ్లు పరారయ్యారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేయించినట్లు డీఎస్పీ రవి చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news