Moviesట్రైలర్ చూసి చెప్పొచ్చు .. సినిమా కేక అని.. ఆనందమే బ్రహ్మ...

ట్రైలర్ చూసి చెప్పొచ్చు .. సినిమా కేక అని.. ఆనందమే బ్రహ్మ (వీడియో)

‘ఫస్ట్ లుక్’తోనే ప్రేక్షకులను పడేసిన “ఆనందో బ్రహ్మా” చిత్ర యూనిట్, అదే ఊపును తాజాగా విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ వరకు విజయవంతంగా కొనసాగిస్తోంది. ఓ పాపకు తాత దెయ్యం కధ చెప్పడంతో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో ప్రతి షాట్ కూడా వీక్షకులను ఆకట్టుకునే విధంగా కట్ చేసారు. అలాగే క్లైమాక్స్ లో ‘మీ తాత చనిపోయి మూడేళ్ళయ్యింది’ అన్న డైలాగ్ తో ట్రైలర్ ను మరింత రక్తి కట్టించారు.

రేయి చీకటి ఉన్న వ్యక్తిగా ‘వెన్నెల కిషోర్’ కామెడీ విన్యాసాలు, వర్మను అనుకరించే షకలక శంకర్ డైలాగ్స్ కు తోడు ప్రధాన పాత్రలో నటించిన శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్, తాప్సీ హావభావాలు… ఇలా పాత్రలన్నీ బాగా పండినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అలాగే సాంకేతిక విభాగంలో అనిష్ తరుణ్ కుమార్ ఫోటోగ్రఫీ, కే అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా అన్నీ అత్యున్నత స్థాయిలోనే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news