Moviesఅమీ తుమీ రికార్డు కేకలు పెట్టిస్తుంది.. చిన్న సినిమాకు భలే లాభాలు

అమీ తుమీ రికార్డు కేకలు పెట్టిస్తుంది.. చిన్న సినిమాకు భలే లాభాలు

భారీ అంచనాల మధ్య వచ్చిన పెద్ద సినిమాలు కొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడితే, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు కొన్ని భారీ విజయాలను అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అమీ తుమీ’ విషయంలోను ఇదే జరిగింది. అడివి శేష్ .. అవసరాల .. వెన్నెల కిషోర్ .. ఈషా .. అదితి వంటి వారు ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు.

ఈ సినిమా ఒకటి రెండు రోజులాడితే గొప్ప విషయం అనుకున్నవాళ్లు లేకపోలేదు. అలాంటి వాళ్ల అంచనాలను తారుమారు చేస్తూ, ఈ సినిమా 60 సెంటర్స్ లో 25 రోజులను పూర్తి చేసుకుంది.ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. పూర్తిస్థాయి వినోదభరితంగా రూపొందడమే ఈ సినిమా సక్సెస్ సీక్రెట్ అని అంటున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఈటీవీ వారు 2.25 కోట్లకి దక్కించుకోవడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news