Gossipsఅమలా కాపురంలో చిచ్చు పెట్టింది ఎవరు..?

అమలా కాపురంలో చిచ్చు పెట్టింది ఎవరు..?

మలయాళ భామ అమలా పాల్ కెరియర్ ప్రారంభించిన మొదట్లోనే కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది. రెండేళ్లు సాఫీగా సాగిన వీరి రిలేషన్ అర్ధాంతరంగా విడాకులు తీసుకునే దాకా వెళ్లింది. ప్రస్తుతం ఎవరికి వారు ఒంటరిగా బ్రతుకుతుండగా అమలా తన భర్తతో విడిపోడానికి ముఖ్య కారణాలు ఏంటో చెప్పింది.

విజయ్ చాలా మంచివాడని కాని హీరోయిన్ గా తనపై వస్తున్న రూమర్లు తనని కాస్త డిస్ట్రబ్ చేశానని అన్నది అమలా. అంతేకాదు మీడియా కథనాలే సగం తన కాపురంలో చిచ్చు పెట్టాయని చెబుతుంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా సరే మీడియా చేసిన రచ్చ వల్లే తను విజయ్ విడిపోవాల్సి వచ్చిందని అన్నది.
ఇక ప్రేమ మీద నమ్మకం ఇంకా చావలేదని చెబుతున్న అమలా పాల్ మళ్లీ పెళ్లికి తాను సిద్ధమే అంటుంది.

మరి గొడవ వారి మధ్య వచ్చినా దానికి కారణం మాత్రం బయట విషయాలే అని తెలుస్తుంది. ఏది ఏమైనా విడిపోయినా సరే విజయ్ మంచి వాడే అంటూ చెబుతున్న అమలాని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news