Gossipsఅల్లు అర్జున్ .. ద బిజినెస్ మ్యాన్

అల్లు అర్జున్ .. ద బిజినెస్ మ్యాన్

నాగార్జున‌, రామ్ చ‌ర‌ణ్  సినీ, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న హీరోలు. ఇప్పుడీ కోవ‌లో మ‌రో కుర్ర హీరో చేరాడు. త్వ‌ర‌ల్లో అల్లు వారి అబ్బాయి కొత్త బిజినెస్ ప్రారంభించ‌నున్నాడు.ఇదే కోవ‌లో ప్రభాస్ కూడా త్వరలోనే కొన్ని బిజినెస్ లను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.అందరిలా కాకుండా ఈ సరైనోడు ఇంటర్ నేషనల్ రుచులను చూపించేందుకు బ‌న్నీ ఒక బేకరీని స్టార్ట్ చేయబోతున్నాడు. కెనోలి కేఫ్ అని జూబ్లీహిల్స్ లో స్థాపించను న్నాడని తెలుస్తోంది. అయితే బన్నీ ఇంతకుముందే అక్కడే  800 అనే క్లబ్ ని స్థాపించాడు.

ఇప్పుడు మళ్లీ మరో వ్యాపార సంస్థ‌ని నెల‌కొల్పేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. అందులో విదేశీ ఫుడ్ ని అందుబాటులో ఉంచ‌నున్నాడు.అంతేకాక ఇప్ప‌టికే ఈయ‌న ప్రో కబడ్డీ లీగ్ లో పెట్టుబ‌డులు పెట్టాడు. చెన్నై తలైవాస్ జ‌ట్టులో కేరళ ఫుట్ బాల్ క్లబ్స్ జ‌ట్టులో బన్నీ భాగస్వామిగా ఉన్నాడు. మొత్తంగా బిజినెస్ మెన్ రోల్ లో ఆయ‌నెంత‌గా రాణిస్తార‌న్న‌ది చూడాలిక.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news