Gossipsబన్ని అంటే బయపడుతున్న టాప్ డైరక్టర్స్..

బన్ని అంటే బయపడుతున్న టాప్ డైరక్టర్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగా హీరోల్లో కాన్ స్టంట్ హిట్లు కొడుతూ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన బన్ని ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్నితో సినిమా తీసేందుకు టాప్ డైరక్టర్స్ ఎవరు క్యూలో లేరు. అయితే ఎవరికి వారు తమ సినిమాల పనుల్లో బిజీగా ఉన్నా బన్నితో సినిమా అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదట.
అలా ఎందుకు అంటే సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేలా మాట్లాడుకునే క్రమంలో బన్ని డైరక్టర్స్ కు కూడా టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడట. సినిమా ది బెస్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో తన దర్శకులను ఇబ్బంది పెడుతున్నాడన్న టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఈ న్యూస్ బాగా వినిపిస్తుంది. బన్ని చెప్పిందే వేదం అన్నట్టుగా డైరక్టర్స్ క్రియేటివిటీలో కూడా వేలు పెడుతున్నాడని అంటున్నారు.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని బన్నితో సినిమా అంటే టాప్ డైరక్టర్స్ సైతం బయపడే పరిస్థితి వచ్చిందట. ఇక కుర్ర హీరోల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. మరి ఈ ఆలోచన విధానం మార్చుకోకపోతే బన్ని చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు సిని జనాలు.http://www.telugulives.com/telugu/touch-chesi-chudu-trailer/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news