Gossipsఅల్లు అర్జున్ ది బెస్ట్ అనేది అందుకే..!

అల్లు అర్జున్ ది బెస్ట్ అనేది అందుకే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమా అని ఫిక్స్ అయ్యారు మెగా.. అల్లు ఫ్యాన్స్. తనకు నచ్చిన పనిని నచ్చిన విధంగా చేసే బన్ని.. తనకు తెలిసిన మాట అందరికి నొప్పించేది అయినా కూడా మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో కాన్ స్టంట్ సక్సెస్ రేటు ఉన్న బన్ని వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు.

ఆర్మీ ఆఫీసర్ గా బన్ని టీజర్ లోనే సినిమా లెక్క ఏంటో చూపించాడు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కంట్రోల్ లో ఉంచేందుకు రెమ్యునరేషన్ కూడా తగ్గించి పనిచేస్తున్నాడట అల్లు అర్జున్. మాములుగా సినిమా కు తీసుకునే రెమ్యునరేషన్ లా కాకుండా ఈ సినిమాకు 10 కోట్లు మాత్రం చాలని చెప్పాడట. ఒకవేళ లాభాల్లో వాటా ఏదైనా సెట్ చేసుకున్నాడో ఏమో కాని నిర్మాతకు మాత్రం బన్ని సపోర్ట్ షాక్ ఇచ్చిందట.

సినిమా అవుట్ పుట్ బాగా రావాలనే ఆలోచనతోనే బన్ని రెమ్యునరేషన్ తగ్గించాడని అంటున్నారు. అదిగాక సినిమాకు కో ప్రొడ్యూసర్ గా నాగబాబు ఉంటునాడు కాబట్టి వీరి కాలిక్యులేషన్స్ అలా ఉన్నాయి. ఏది ఏమైనా సినిమా కోసం పారితోషికం పట్టించుకోకుండా బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా కృషి చేస్తున్నాడు కాబట్టే బన్నికి అన్ని సూపర్ హిట్లు వస్తున్నాయని అంటున్నాయి సినిమా వర్గాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news