Gossipsఆర్జీవీ లేకపోతే సివిల్స్ టాపర్ లేడు..!

ఆర్జీవీ లేకపోతే సివిల్స్ టాపర్ లేడు..!

ఈమధ్యనే సివిల్స్ లో 624వ ర్యాంక్ సాధించిన హన్మకొండకు చెందిన అక్షయ్ కుమార్ తాను రాం గోపాల్ వర్మకు పెద్ద అభిమాననినని.. ఆయన స్పూర్తితోనే ఈ రోజు ఈ ర్యాంక్ వచ్చిందని అన్నారు. ఇంటర్ టైంలో తాను ఆర్జివి గురించి తెలుసుకున్నానని.. ఆయన దృష్టిలో తప్పొప్పులు ఉండవు.. చాలా లిబరల్ గా ఉండాలని ఆయన ఎప్పుడు చెబుతారని.. అంతేకాదు మూడ నమ్మకాలని పట్టించుకోవద్దని.. తత్వవేత్తలను ఆయన చిన్న వయసులోనే చదివేశారని ఆర్జివిని పొగడ్తలతో ముంచెత్తాడు అక్షయ్ కుమార్.

ఒకానొక దశలో ఆయన్ను చదివితే సరిపోద్ది అని తాను నిర్ణయించుకున్నానని.. అందుకే ఆయన వీడియో ఏది రిలీజ్ అయినా అది తప్పకుండా చూస్తానని అన్నారు అక్షయ్. పదిమంది ఒకలా మాట్లాడితే ఆయన మరోలా మాట్లాడుతారు. సెకండియర్ వరకు ఒకలా ఉన్న తాను ఆర్జివిని ఫాలో అవడం దగ్గర నుండి ఆయనలా ఆలోచించడం మొదలు పెట్టానని అన్నారు. అంతేకాదు నాలా మరో ఐదుగురిని ఆర్జివి అభిమానులుగా చేశానని చెప్పుకొచ్చారు.

ఇక తనకు ఆర్జివిని కలవాలని ఉందని.. కాకపోతే ఆయన నన్ను పట్టించుకోకపోతే బాధేస్తుందని. అందుకే గొప్పవాడిని అయ్యాక ఆయన్ను కలుస్తానని అన్నాడు అక్షయ్. ఇక ఈ వీడియోని ట్వీట్ చేసి తాను నేరస్థులను ప్రభావితం చేస్తున్నా అని అనుకునే వారికి ఈ టాపర్ చూసైనా తగిన గుణపాఠం నేర్చుకుంటారని కామెంట్ పెట్టాడు ఆర్జివి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news