Moviesఅఫీషియల్ : ‘అజ్ఞాతవాసి’ టోటల్ కలెక్షన్స్.. ఇండియన్ హిస్టరీలో మూడో అతిపెద్ద...

అఫీషియల్ : ‘అజ్ఞాతవాసి’ టోటల్ కలెక్షన్స్.. ఇండియన్ హిస్టరీలో మూడో అతిపెద్ద డిజాస్టర్

‘అజ్ఞాతవాసి’.. రిలీజ్‌కి ముందు దీనిపై నెలకొన్న అంచనాలు అన్నీఇన్నీ కావు. తిరుగులేని ఫాలోయింగ్ వున్న పవన్ కళ్యాణ్.. ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్ డైరెక్టర్‌గా పేరొందిన త్రివిక్రమ్.. ఈ ఇద్దరూ ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత చేతులు కలపడంతో.. సాధారణంగానే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అదిచూసి బయ్యర్లు కూడా బ్లైండ్‌గా భారీ కోట్లు వెచ్చి హక్కులు విక్రయించారు. దాంతో థియేట్రికల్ బిజినెస్సే రూ.125 కోట్ల మార్క్‌కి చేరుకుంది. క్రేజ్ బాగుండడంతో.. ఖచ్చితంగా ఆ అమౌంట్ రికవర్ చేయడంతోపాటు భారీ లాభాలు కురిపిస్తుందని అనుకున్నారు.

కట్ చేస్తే.. ప్రీమియర్ షోస్ వేసినరోజే ఆ అంచనాలన్నీ గల్లంతయ్యాయి. ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్సే తిట్టిపోసేశారు. ప్రీబుకింగ్స్ కారణంగా తొలిరోజు ‘నాన్-బాహుబలి’ కలెక్షన్స్ వచ్చాయి కానీ.. టాక్ కారణంగా రెండోరోజు గణనీయంగా డ్రాప్ అయిపోయాయి. వీకెండ్ అయినా సరే.. ఏ ఒక్కరూ ఆసక్తి చూపకపోవడంతో వసూళ్ళు ఏమాత్రం పుంజుకోలేదు. ఇక సోమవారం వచ్చేసరికి లక్షల్లోనే కలెక్షన్లు నమోదయ్యాయి. తీరా చూస్తే.. భారీ నష్టాలతో ఈ మూవీ ఇండియన్ హిస్టరీలోనే మూడో అతిపెద్ద డిజాస్టర్‌గా చాపచుట్టేసింది. అవును.. రూ.125 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ అందులో సగం కూడా రికవర్ చేయకుండా మొహం చాటేసింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా టోటల్ రన్‌లో రూ.57.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే.. పెట్టిన పెట్టుబడిలో కేవలం 46% మాత్రమే రికవర్ చేసింది. దీంతో.. ఇది డబుల్ డిజాస్టర్ జాబితాలోకి చేరింది. దేశచరిత్రలో అతిపెద్ద డిజాస్టర్లలో తొలిరెండు స్థానాల్లో బాంబే వాల్వెట్, స్పైడర్ చిత్రాలు నిలవగా.. ‘అజ్ఞాతవాసి’ మూడో స్థానం కైవసం చేసుకుంది.

ఏరియాలవారీగా టోటల్ కలెక్షన్స్ (కోట్లలో)
వైజాగ్ : 5.40
ఈస్ట్ : 4.25
వెస్ట్ : 4.75
కృష్ణా : 3.35
గుంటూరు : 5.15
నెల్లూరు : 2.25
సీడెడ్ : 5.30
నైజాం : 10.45
ఏపీ+నైజాం : 40.90
యూఎస్ఏ : 7.20
కర్ణాటక : 6.35
రెస్టాఫ్ ఇండియా : 1.15
రెస్టాఫ్ వరల్డ్ : 1.90
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ.57.50 కోట్లు (షేర్)
టోటల్ గ్రాస్ : రూ.94.60 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news