Gossipsవివాదాలతో పూర్తి చేసుకున్న అజ్ఞాతవాసి సెన్సార్..!

వివాదాలతో పూర్తి చేసుకున్న అజ్ఞాతవాసి సెన్సార్..!

పవర్ స్టార్ త్రివిక్రం కాంబోలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న అజ్ఞాతవాసి సినిమా సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి భాగం మొత్తం తన ఐడెంటిటీ కనిపెట్టే హీరో సెకండ్ హాఫ్ లో హీరో బిల్డప్ షాట్స్ తో అదరగొట్టాడట త్రివిక్రం.

అంతేకాదు బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ కూడా అదరగొట్టేశారట. సినిమాలో ఖుష్బు కూడా నటిస్తుందని తెలిసిందే. ఇక అజ్ఞాతవాసి సెన్సార్ కు వెళ్లడానికి ముందు లార్గో వించ్ అనే ఫ్రెంచ్ మూవీకి కాపీ అని అంటున్నారు. అయితే ఆ సినిమా అన్ని భాషల్లో రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న టి-సీరీస్ ఈ సినిమాపై వివాదం రేపుతున్నారు. సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయం కూడా క్లారిటీ లేదని అంటున్నారు.

అయితే ఈ విషయాలేమి పట్టించుకోకుండా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూజిట్. న్యూ ఇయర్ పవర్ స్టార్ సాంగ్ తో పాటుగా కొత్త పోస్టర్స్ తో కూడా ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news