పవన్ పిలుస్తున్నాడు … కొడకా కోటేశ్వరరావా ! 

pawan-kalyan

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసాయి. వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకి టైటిల్స్ గా చాలా ప్రచారం జరిగినా చివరకు “అజ్ఞాతవాసి” టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ట్విట్టర్లో హల్చల్ చేస్తుంది.

పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక పాట పాడాడంట. ‘కొడకా కోటేశ్వరావా’ అనే ఈ పాట ఆ చిత్రం ఆల్బమ్ కే హైలైట్ అంట. గతంలో కూడా పవన్ కళ్యాణ్ తన చిత్రాల కోసం పాటలు పాడారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఆయన పాడిన కాటమ రాయుడా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ‘కొడకా కోటేశ్వరావా’ అనే ఈ పాటను ఆ చిత్ర వర్గాలు దృవీకరించాల్సి ఉంది.

ఆ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆ షెడ్యూల్ పూర్తి అవుతుందంట. దాని తరువాత పవన్ కళ్యాణ్ పూర్తి సమయం తన జనసేన పార్టీ కార్యకలాపాలకే వినియోగించనున్నారు.

More from my site