News పెళ్ళికాకముందే పూర్ణ ప్రెగ్నెంట్.. బాధ తట్టుకోలేక ఏడ్చేసిన అమ్మడు!

పెళ్ళికాకముందే పూర్ణ ప్రెగ్నెంట్.. బాధ తట్టుకోలేక ఏడ్చేసిన అమ్మడు!

In the recent interview, actress Poorna remembered worse gossip in her career which hurts her feelings along with family members.

నటీనటులకు సంబంధించి ఏదైనా ఓ విషయం తెలిస్తే చాలు.. మీడియావాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని లేనిపోని రూమర్లు క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి.. ఏదైనా ఓ ఈవెంట్‌లో హీరో, హీరోయిన్లు కాస్త సన్నిహితంగా కనిపిస్తే.. ఆ ఇద్దరి మధ్య పప్పులేవో ఉడుకుతున్నాయని ప్రచారం చేయడం మొదలుపెట్టేస్తారు. అంతేకాదు.. సినిమాల్లో వాళ్లు పోషించే పాత్రల మీద రకరకాల వార్తలు సృష్టించడంలో వెబ్‌సైట్స్, మీడియా దేనికవే సాటి. అయితే.. ఓసారి అవి హద్దులు దాటేస్తాయి. దాంతో.. హీరోయిన్లతోపాటు వారి కుటుంబసభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు గురవ్వాల్సి వస్తుంది. ఓ వార్త తనని చాలా బాధపెట్టిందని, తన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడిందని హీరోయిన్ పూర్ణ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

తన లేటెస్ట్ ఫిల్మ్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి పూర్ణ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో.. ‘మీ కెరీర్‌లో మిమ్మల్ని బాధపెట్టిన ఏదైనా గాసిప్ లేదా వార్త ఉందా? అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. ఓ ఇన్సిడెంట్ గుర్తుకు తెచ్చుకుంది. ఓ తమిళ చిత్రంలో తాను ప్రెగ్నెంట్ క్యారెక్టర్ పోషించినప్పుడు.. కేరళ మీడియా, వెబ్‌సైట్స్ తాను గర్భవతినయ్యాయంటూ వార్తలు ప్రచురించాయని పేర్కొంది. ‘పూర్ణ గర్భిణి అయ్యింది’ అని పెద్ద పెద్ద హెడ్డింగ్‌లు పెట్టి వార్తలు రాశారని తెలిపింది. చూసిన ప్రతిఒక్కరూ పూర్తి వార్త చదవకుండా కేవలం హెడ్డింగ్ చూసి.. పెళ్ళికాకుండానే పూర్ణ గర్భవతి అయ్యిందా? అని చర్చించుకున్నారు. దాంతో తాను చాలా బాధపడ్డానని, తన ఫ్యామిలీ కూడా మనోవేదనకు గురయ్యిందని ఆమె చెప్పింది. తన కెరీర్‌లో అత్యంత చెత్త వార్త ఏదైనా ఉందంటే.. అది ఇదేనని పూర్ణ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news