పెళ్ళయిన నాలుగో రోజే ఆ బాధ తట్టుకోలేక ఆ పని చేశానంటున్న ‘అ..ఆ’ బ్యూటీ

actress hari teja talks about her marriage life

‘A Aa’ actress Hari Teja talks about her marriage life. After four days of her marriage, she told that husband make her cry. Read below story to know the reason.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ సినిమాలో హీరోయిన్ సమంత పక్కన ‘మంగమ్మ’గా అందరినీ ఆకట్టుకుంది నటి హరితేజ. అంతకుముందే ‘మనసు మమత’ అనే సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ భామ.. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా.. తన సీక్రెట్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తూనే.. సినీ ఫక్కీలో సినీఫక్కీలో జరిగిన తన పెళ్లి గురించి కూడా ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

‘రెండేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన దీపక్ మ్యాచ్ వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న టైమ్‌లో.. అన్నిరకాల సర్టిఫికెట్స్‌ని చూపించమని మా నాన్న దీపక్‌ని అడిగారు. మా నాన్నకు నా మీద ఓవర్ కేరింగ్ ఉండడం వల్ల అలా చెప్పారు. ఆ విషయం మన మధ్యే ఉంటుందని.. ఓ ఫ్రెండ్‌గా భావించి చూపించామని నాన్న అన్నారు. అయితే.. అలా అడిగినందుకు దీపక్‌కి చాలా కోపం వచ్చింది. నామీద నమ్మకం లేదా? మీరెలా అడిగారు? అంటూ వాళ్ల నాన్నకు చెప్పడం.. వాళ్ల నాన్న మాకు ఫోన్ చేసి మీకు నమ్మకం లేకుంటే మానేయని అనడం.. పెద్ద గొడవ జరగడంతో.. అప్పట్లో పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ రెండేళ్ల తర్వాత దీపక్ నన్ను కలిసి.. పాత గొడవలు మర్చిపోయి, పెళ్లి చేసుకుందామన్నాడు. నా ప్రొఫెషన్‌కి అడ్డు రాకపోతే సరే అన్నాను’ అని హరితేజ పెళ్ళి గురించి చెప్పుకొచ్చింది. అయితే.. పెళ్ళయిన నాలుగోరోజే తనకు ఏడవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ వివరాల్ని కూడా వెల్లడించింది.

‘అప్పటికి మా పెళ్లయిన నాలుగో రోజు అది. సాయంత్రం భర్తతో కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దామన్న ఉద్దేశంతో రెడీ అయ్యాను. దీపక్ ఆఫీస్ నుంచి రాగానే.. ఎంచక్కా ట్రాక్ సూట్ వేసుకుని ‘నేను జిమ్‌కి వెళ్తున్నాను.. వస్తావా’ అని అన్నాడు. నేను రానంటే తను వెళ్లిపోయాడు. అప్పుడు నాకు చాలా బాధేసింది. ఏడుపు వచ్చేసింది. బాగా డిప్రెషన్ ఫీలయ్యి అమ్మకు చెప్పాను. ‘పర్లేదు.. అబ్బాయిలు మెల్లగా మారుతారు’ అని అమ్మ నాకే క్లాస్ పీకింది. ఆ తర్వాత దీపక్‌కి ఫిట్నెస్‌పై ఎంత ఇష్టమో తెలుసుకుని.. నేనే జిమ్‌కి వెళ్లడం ప్రారంభించా’ అని హరితేజ చెప్పింది.

More from my site