Newsమహానటి థియేటర్ లో హరితేజ కి ఘోర అవమానం ..ఆన్ లైన్...

మహానటి థియేటర్ లో హరితేజ కి ఘోర అవమానం ..ఆన్ లైన్ లో ఒకటే ఏడుపు !!

సినిమా వాళ్లంటే ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉన్నా ఎక్కడో ఓ చోట చిన్నచూపు ఉంటుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న ఆడవాళ్ల మీద బయట వ్యక్తులు వేరేలా చూడటం అలవాటే. ఈ క్రమంలో కొన్నిసార్లు కొందరు వ్యక్తులు మాట్లాడే మాటలకు సినిమా వాళ్లు హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితే బిగ్ బాస్ హరితేజకు వచ్చింది.

మహానటి సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లిన హరితేజకు తన పక్క సీట్లో కూర్చున్న వారికి జరిగిన వాదన పట్ల హరితేజ బాగా హర్ట్ అయ్యింది. తన తండ్రి పక్కన కూర్చోండి అని ఎవరినో అన్నందుకు మీ సినిమా వాళ్లు ఎవరి పక్కనైనా కూర్చుంటారు మాకా దరిద్రం పట్టలేదని అన్నారట. దీనిపై థియేటర్ లోనే దెబ్బలాడిన హరితేజ తన సోషల్ బ్లాగ్ లో సినిమావాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని చెప్పుకొచ్చింది.

సినిమాల్లో నటిస్తున్నంత మాత్రానా మాకు పర్సనల్ లైఫ్ ఉండదని భవిస్తే ఎలా.. మేము మా జీవితాలను సాగించాలి. కాసేపు సరదాగా వచ్చి సినిమా చూసి రిలాక్స్ అవుదాం అనుకున్న వారే సినిమా వాళ్లను తక్కువ చేసి చూడటం మంచిది కాదిని అలా ఆలోచించే వారికి కాస్త దేవుడు బుద్ధి జ్ఞానం ఇవ్వాలని ఆవేశంగా చాలా బాధతో వీడియో మెసేజ్ పెట్టింది హరితేజ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news