Gossipsమిల్కీ బ్యూటీ మోసపోయిందా..!

మిల్కీ బ్యూటీ మోసపోయిందా..!

మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ గా జై లవ కుశలో ఎన్.టి.ఆర్ పక్కన స్వింగ్ జరా అంటూ చిందులేసింది. ఆ సాంగ్ లో తమన్నా అందాలను చూసి అందరు షాక్ అయ్యారు. హాట్ లుక్స్ తో అదరగొట్టిన తమ్మూ ఆ సాంగ్ తో ఊహించిన క్రేజ్ వస్తుంది అనుకుంటే అది కాస్త తుస్సుమనిపించింది. జై లవ కుశ సినిమాలో తమన్నా సాంగ్ కోసం రిలీజ్ ముందు చేసిన హంగామా తెలిసిందే.

తమన్నా ఫస్ట్ లుక్ సాంగ్ మీద అంచనాలు పెంచగా స్వింగ్ జరా అంటూ వచ్చిన సాంగ్ మాత్రం అంతగా కిక్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ తో సాంగ్ చేసినందుకు తమన్నా బాధపడుతుందట. జై లవ కుశలో ఐటం సాంగ్ చేసి కెరియర్ లో కొత్త జోష్ తెచ్చుకుందామనుకున్న అమ్మడికి నిరాశే మిగిలింది. సినిమాలో రెచ్చిపోయి మరి అందాల ప్రదర్శన చేసిన తమన్నా దానికి తగ్గ ఫలితం మాత్రం అందుకోలేకపోయింది.

జనతా గ్యారేజ్ లో కాజల్ తో పక్కా లోకల్ సాంగ్ ఓ రేంజ్ హిట్ అయ్యింది. కాజల్ కెరియర్ లో ఆ సాంగ్ వెరీ వెరీ స్పెషల్ ఇక అదే రేంజ్ లో తమన్నా ఈ స్వింగ్ జరా ఆశించింది కాని ఇక్కడ రివర్స్ కొట్టింది. కనీసం సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి తమన్నా సంతోషించొచ్చు లేదంటే ఆమె ఐటం సాంగ్ వల్లే పోయిందని అన్నా అనేవాళ్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news