News‘బాహుబలి-2’ సక్సెస్... ఆమిర్ ఖాన్ పర్ఫెక్ట్ రియాక్షన్

‘బాహుబలి-2’ సక్సెస్… ఆమిర్ ఖాన్ పర్ఫెక్ట్ రియాక్షన్

‘బాహుబలి-2’ సినిమా హిందీలో సంచలనాలు సృష్టించడంతో.. అక్కడి సెలబ్రిటీలు దీనిపై ఎలా స్పందిస్తారోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు కాకపోతే రేపైనా రియాక్ట్ అవుతారని తెగ వెయిట్ చేశారు తెలుగు ఆడియెన్స్. కానీ.. వారం రోజులు గడిచినా ఒక్కరూ స్పందించలేదు. ఇక వీరు స్పందించకపోవచ్చు అని అనుకుంటున్న తరుణంలో తొలుత ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. అనంతరం అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ ట్విటర్ వేదికగా కొనియాడాడు. ఇంకొన్నిరోజుల తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ అయితే ఆకాశానికెత్తేశాడు. ఇప్పుడు తాజాగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఈ చిత్రంపై స్పందించాడు.

సచిన్ టెండూల్కర్ జీవిత కథతో తెరకెక్కిన ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమా ప్రిమియర్ షోకి హాజరైన ఆమిర్.. ఆ తర్వాత మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు ‘బాహుబలి-2’ గురించి మాట్లాడాడు. బాహుబలి-2 సాధించిన విజయాన్ని చూసి తాను గర్విస్తున్నట్లుగా చెప్పిన ఆమిర్.. ఆ చిత్రంతో ‘దంగల్’తో పోల్చడం సరికాదన్నాడు. ‘‘బహుబలి-2 సినిమాని నేనింకా చూడలేదు కానీ.. దాని గురించి నా సన్నిహితుల నుంచి చాలా విషయాలు విన్నాను. ఆ సినిమా గొప్ప సక్సెస్ సాధించినందుకు రాజమౌళితోపాటు మొత్తం చిత్రబృందాన్ని అభినందిస్తున్నా. ఇక దంగల్ సినిమాకు చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతుండటంపై చాలా ఆనందంగా ఉంది. ఐతే.. ఆ రెండు సినిమాల్ని పోల్చి చూడటం సరి కాదు. దేని స్థానం దానిదే. అన్నిటికీ మించి.. రెండు భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించడం.. మంచి విషయం. నేను నా సినిమాతో పాటు ‘బాహుబలి’ని చూసి కూడా గర్విస్తున్నా’’ అని అమీర్ అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news