Moviesఆది సాయికుమార్ నెక్స్ట్ నువ్వే..! ( పోస్టర్స్ )

ఆది సాయికుమార్ నెక్స్ట్ నువ్వే..! ( పోస్టర్స్ )

ఆది సాయికుమార్ హీరోగా బుల్లితెర ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా నెక్స్ట్ నువ్వే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ అయ్యింది. రీసెంట్ గా శమంతకమణిలో కార్తిక్ పాత్రలో అదరగొట్టిన ఆది సాయికుమార్ అదే జోష్ తో ఈ నెక్స్ట్ ఏంటితో రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ మాత్రం ప్లెజెంట్ గా ఉంది.

రష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. వి4 మూవీస్ బ్యానర్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా కథ ఏంటన్నది ఫస్ట్ లుక్ పోస్టర్ లో తెలియట్లేదు కాని పోస్టర్ లో ఆది షాకింగ్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమా ఆడియెన్స్ ను అదే సర్ ప్రైజ్ కు గురయ్యేలా చేయడం ఖాయమని చెప్పొచ్చు.

కుర్ర హీరోలందరు ప్రయోగాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే ఆది సాయి కుమార్ ఇన్నాళ్లు రొటీన్ పంథాలో సినిమాలు తీస్తూ వచ్చాడు. శమంతకమణితో తన యాక్టింగ్ ప్రెజెంటేషన్ లో కూడా కొత్తదనం చూపించిన ఆది సాయి కుమార్ ఈసారి గట్టి హిట్ కొడతాడు అనడంలో సందేహం లేదనిపిస్తుంది.

aadhi-sai-kumar-next-nuvve-movie-poster
aadhi-sai-kumar-next-nuvve-movie-poster

aadhi-sai-kumar-next-nuvve-movie-poster
aadhi-sai-kumar-next-nuvve-movie-poster

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news