Specialsమాపై మీ 'మిస్టర్' 'రోగు'లెందుకు.. సినీ అభిమాని ఆవేదన !!

మాపై మీ ‘మిస్టర్’ ‘రోగు’లెందుకు.. సినీ అభిమాని ఆవేదన !!

ఒక స్టార్ డైరెక్టర్ సినిమా వస్తుందంటేనే మాకు పెద్ద పండుగ.. విడుదలకి కొన్ని రోజులకి ముందరే మా మది నిండా ఆ సినిమానే నిండి పోతుంది. ఆ సినిమా గురించే మా మాటలు.. మా స్నేహితుల మధ్య వాదనల యుద్దాలు.. ఇక విడుదల రోజైతే ఇంట్లో అమ్మ నాన్న అన్నా చెల్లి అక్కా తమ్ముడు ఎవ్వరి మాట వినం.. ఎంత పెద్ద పనైనా సినిమా తర్వాతే అనుకుంటూ థియేటర్ల వైపు పొద్దు పొద్దున్నే పరుగులు పెడతాము. సినిమా నడుస్తున్నంతసేపూ మా హడావుడి అంతా ఇంతా కాదు. మన సాంప్రదాయ పండగలకంటే కూడా ఈ సినిమా పండగకే మేము ఎక్కువగా ఎంజాయ్ చేస్తాము.సినిమా హిట్ టాక్ వచ్చిందంటే మాత్రం నెల రోజుల పాటు మాకు ఇంకా ఏమీ కనిపించదు.

ఒక సాధారణ వ్యక్తి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కావాలంటే ఎంత కష్టముంటుందో ఈ ఇంటర్ నెట్ వలన మన అందరికీ తెలుస్తున్నది. ఇక స్టార్ డైరెక్టర్ కావాలంటే కూడా అది ఎన్నో ఏళ్ల కృషి.. మాటలకి అందని డెడికేషన్. ఈ కాలంలో పెద్దగా అనుభవం లేని వారు సైతం వెరైటీ కాన్సెప్ట్ల్ లతో.. ఒక క్షణం, పెళ్లి చూపులు, ఘాజీ లాంటి సినిమాలు తీస్తున్న రోజులివి. అటువంటిది ఎన్నో ఢక్కా ముక్కీలు తిని.. స్టార్ డైరెక్టర్ల స్థాయికి వచ్చి 10 కోట్ల రూపాయల పైన రెమ్యూనరేషన్ తీసుకునే మీనుంచి ఎన్ని అద్భుతాలు రావాలి ?. కానీ ఎందరికో ఆదర్శంగా నిలిచిన మీరు.. ఈ మధ్య తీస్తున్న సినిమాలు నిజంగా మీరే తీస్తున్నారా ?? అసలు ఆ సినిమాలు మీరు థియేటర్లలో చూడగలరా ??

విజయం నెత్తికెక్కి.. ఏమి తీసినా చెల్లుతుంది అని నిర్మాతల డబ్బులు, ఆ సినిమా విజయాలపై ఆధారపడ్డ ఎన్నో వందలమంది శ్రమ ని ఎందుకు అంత తేలికగా తీసుకుంటున్నారు? ఒక సామాన్య సినీ ప్రేక్షకుడు చెప్పగలుగుతున్న లోపాలు మీకు తెలియకుండా ఉంటాయా అన్నది మాలాంటి వాళ్ళెందరికో అర్థం కాని ప్రశ్న?? తెలిసి తప్పు తీస్తున్నారా ?? ఏది ఏమైనా మీ నుంచి ఎంతో మంచి క్వాలిటీ సినిమాలు మును ముందు మరిన్ని రావాలని ఆశిస్తూ… సినిమా పిచ్చి అభిమాని

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news