ఒకటి రెండు కాదు ఏకంగా 62 గెటప్పుల్లో బాలయ్య బాబు..!

balayya

నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకటి రెండు గెటప్పులో కనిపిస్తేనే రికార్డులు సృష్టించగలడు. అలాంటిది ఆయన నటించబోయే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఏకంగా 62 గెటప్పుల్లో కనిపించనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం జై సింహా ప్రమోషన్స్ లో బీభత్సంగా బిజీ అయిన బాలకృష్ణ తేజ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి ప్రస్థావించారు.

సినిమాలో తాను 62 గెటప్పులలో కనిపిస్తానని అన్నారు. అయితే గెటప్పులు ఎన్నైనా పాత్ర ఒక్కటే అని చెప్పారు. ఇదవరకు కమల్ హాసన్ దశవతారాల్లో కనిపించగా బాలయ్య 62 గెటప్పులతో అలరించబోతున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా గెటప్పులు చూసి ఫ్యాన్స్ సంబరపడతారని అంటున్నాడు బాలయ్య.

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మిత్రుల గురించి శత్రువుల గురించి ఉంటుందని అన్నారు. ఇక సినిమాలో బాలయ్యగా తన పాత్ర ఉంటుందని అయితే అది కేవలం ఒకటి రెండు సీన్స్ మాత్రమే అని అన్నారు.

Leave a comment